గడ్డెన్న వాగులోకి 262 క్యూసెక్కుల వరద నీరు

57பார்த்தது
ఎగువ కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 262 క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టులోకి చేరినట్లు బుధవారం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358. 70 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 357. 70 మీటర్లుగా ఉందని పేర్కొన్నారు. భారీగా వర్షాలు ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி