కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 696. 575 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 7, 821 క్యూసెక్కుల వరద నీరు రాగా, లెఫ్ట్ కెనాల్ ద్వారా 580, మిషన్ భగీరథకు 9, ఒక గేట్ ఓపెన్ చేసి 3, 745 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.