కడెం ప్రాజెక్టు నుండి 11వేల క్యూసెక్కుల నీటి విడుదల

65பார்த்தது
కడెం ప్రాజెక్టు నుండి సుమారు 11 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ ప్రాజెక్టులోని మూడు గేట్లను నాలుగు ఫీట్లు ఎత్తి సుమారు 11, 016 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పరిసరాలలోకి ఎవరు వెళ్ళవద్దని వారు కోరారు.

தொடர்புடைய செய்தி