యూపీలో కొత్త విధానం.. హెల్మెట్‌ లేకుంటే పెట్రోల్‌ బంద్

74பார்த்தது
యూపీలో కొత్త విధానం.. హెల్మెట్‌ లేకుంటే పెట్రోల్‌ బంద్
రోడ్డు ప్రమాదాల నివారణకు యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'నో హెల్మెట్ నో ఫ్యూయల్' విధానానికి సర్కార్ శ్రీకారం చుట్టింది. కొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేసింది. ద్విచక్రవాహనాలపై హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే పెట్రోల్‌ను విక్రయించకూడదని అన్ని పెట్రోల్ బంక్‌లకు నోటీసులు ఇచ్చింది. కాగా, ద్విచక్రవాహనం వెనుక సీటులో కూర్చునే వారికి సైతం నిబంధనలు వర్తించనున్నాయి.

தொடர்புடைய செய்தி