టాలీవుడ్ స్టార్ నటి సమంత సోమవారం తన ఇన్స్టా వేదికగా అభిమానులతో సరదాగా కాసేపు ముచ్చటించింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘ప్లీజ్ మేడం, కాస్త బరువు పెరగండి’ అంటూ కామెంట్ పెట్టారు. ఈ కామెంట్ పై సమంత అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘మయోసైటిస్ కారణంగా వైద్యుల సూచనల మేరకు నేను యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో ఉన్నాను. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల నా బరువు ఇలానే ఉండాలి. ఇతరులను జడ్డ్ చేయడం ఆపండి’ అంటూ సమాధానం ఇచ్చింది.