నర్వ: వ్యవసాయ కూలీల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆటో డ్రైవర్లు
నర్వ మండల కేంద్రంలోని మంగళవారం లంకాల గ్రామం నుండి నర్వ మీదుగా వెళుతున్న ఆటోలో దాదాపుగా 25 మంది పైచిలుకుగా వ్యవసాయ కూలీలు ఉన్నారు. ఏ కొద్దిపాటి చిన్న ప్రమాదం జరిగిన భారీ నష్టాన్ని కూడగట్టుకుంటారు. ఒక ఆటోలో 8 మంది కంటే ఎక్కువగా వెళ్లడం చాలా ప్రమాదం అని తెలిసి కూడా నిర్లక్ష్యంగా పోతున్న దుస్థితి. నర్వ మండలంలోని పోలీసు వాళ్ళు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.