వనపర్తి జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాలమూరు, రంగారెడ్డి, కేఎల్ఐ ఇతర రిజర్వాయర్ ప్రాజెక్టుల భూసేకరణపై మంగళవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో తమ సిబ్బందితో సమీక్షిస్తూ, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నీటి పారుదల ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ యం. నాగేష్ పాల్గొన్నారు.