దేశంలో 22 భాషలకు అధికారిక గుర్తింపు ఉంది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల ప్రజలు భారత కరెన్సీని సులభంగా అర్ధం చేసుకునేందుకు 15 ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని కరెన్సీ నోట్లపై ఆర్బీఐ ముద్రిస్తోంది. ఆ జాబితాలో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఉర్దూ భాషలు ఉన్నాయి. వీటితో పాటు హిందీ, ఇంగ్లీషులోనూ సమాచారం ఉంటుంది.