నల్లగొండలో తల్లీకుమార్తె అదృశ్యం
కుటుంబ కలహాలతో భర్తతో ఘర్షన పడి కూతురును తీసుకుని తల్లి అదృశ్యమైంది. ఈ సంఘటన నల్లగొండ వనటౌన పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. సీఐ రాజశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని హైదర్ఖానగూడకు చెందిన కత్తుల సుధ ఆమె భర్త ప్రసాద్ కుటుంబ పరమైన విషయాలలో శనివారం రాత్రి సమయంలో ఘర్షణ పడ్డారు. ఈ విషయంలో మనస్తాపానికి గురైన కత్తుల సుధ, ఆమె కూతురు కావ్యని వెంట తీసుకుని రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయింది.