
నల్గొండ: శిక్షణ పొందిన 3 అభ్యర్థులు కానిస్టేబుల్స్ గా ఎంపిక
ఇటీవల ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జిడి ఫలితాలలో నల్గొండ జిల్లా పరిషత్ స్టడీ సెంటర్ ద్వారా శిక్షణ పొందిన 3 అభ్యర్థులు కానిస్టేబుల్ గా ఎంపికైనట్లు జడ్పీ సీఈవో ప్రేమ్ కరన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో వేములపల్లి మండలం, శెట్టి పాలెం గ్రామానికి చెందిన కోడిరెక్క నవీన్ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గా ఎంపిక అయ్యారని తెలిపారు. దిర్షించర్ల గ్రామానికి చెందిన పల్లి రాజేష్ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గా ఎంపిక అయ్యాడని తెలిపారు.