నల్గొండ పట్టణంలోని బ్రహ్మంగారి గుట్టపైన దుర్గామాత ఆలయాన్ని నిర్మించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన బ్రహ్మంగారి గుట్టను దర్శించుకొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.. బ్రహ్మంగారి గుట్ట నల్లగొండ జిల్లాలోనే ప్రశస్తి పొందిందన్నారు. బెజవాడ కనకదుర్గమ్మ మాదిరిగానే బ్రహ్మంగారి గుట్టపై వెలసిన అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తుందన్నారు.