తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతుందని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గత రెండు రోజుల క్రితం ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో బీసీలకు అన్యాయం జరిగిందని, సమాజంలో ఆరు శాతం ఉన్నవారికి 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం బీసీలను నట్టేట ముంచే చర్య అన్నారు.