వినియోగ దారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ఆహార సంస్థ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ వారి ఆదేశాల మేరకు, భారత ఆహారసంస్థ నల్గొండ డివిజనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 17 తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతయే సేవ కార్యక్రమం నిర్వహించబడుతుందని సంస్థ ఇన్చార్జి డివిజనల్ మేనేజర్ హీరా సింగ్ రావత్ ఒక ప్రకటనలో తెలిపారు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.