అంగన్వాడీ టీచర్స్ కి స్థానిక అధికారులు అదనపు పనులు కేటాయించటం వలన సెంటర్స్ నిర్వహించడం కష్టంగా మారుతుందని, కావున అంగన్వాడీ టీచర్లకు అదనపు పనులు బీఎల్ఓ డ్యూటీలు రద్దు చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో మోతిలాల్ కి మెమొరాండం సమర్పించారు.