రెండు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల
మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం ప్రాజెక్టుకు 1227 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా. అధికారులు రెండు క్రస్ట్ గేట్లను పైకెత్తి 977 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్లో ప్రస్తుతం 643. 85 అడుగుల మేర నీరు ఉంది. ఎడమ కాల్వ ద్వారా 48 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 41 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.