పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయటంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి విమర్శించారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం గ్రామంలో శనివారం నాడు జరిగిన సిపిఎం గ్రామ శాఖ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధరలు తగ్గినా, భారత దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించకపోవటం వల్ల ప్రజల నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.