చిట్యాల మండలం ఎలికట్టే గ్రామానికి వచ్చే ప్రవైట్ పాఠశాలకు చెందిన బస్సుల ముందు ప్రభుత్వ పాఠశాల
విద్యార్థులు బుధవారం ధర్నా చేసి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో
విద్యార్థులు లేక మూతపడే స్థితికి రావడం తో గ్రామంలో ప్రవైట్ పాఠశాలకు వెళ్లే
విద్యార్థులు ప్రభుత్వ బడికి రావాలని నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. సర్పంచ్ ఉయ్యాల సత్తయ్య గౌడ్, ఎంపిటిసి సభ్యులు గోలనుకొండ దశరథ, ఉప సర్పంచ్ సాగర్ల యాదయ్య పాల్గొన్నారు.