నల్గొండ: సరైన తేమ శాతంతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
సరైన తేమ శాతంతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి పంపించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులను ఆదేశించారు. మంగళవారం ఆమె నల్గొండ జిల్లా హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాలియా పరిధిలో కోతలు ఎప్పుడు పూర్తవుతాయని జిల్లా కలెక్టర్ అడిగారు.