నల్గొండ జిల్లా హాలియా మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అక్కడి అధికారులకు సూచించారు. అనంతరం పట్టణంలో కొనసాగుతున్న సమగ్ర సర్వేను పరిశీలించారు.