నాగార్జునసాగర్ లోని బుద్ధవనం పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో స్టార్ హోటల్ నిర్మాణంతో పాటు, వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద ఉన్న బుద్ధవనం పరిసర ప్రాంతాలను శ్రీ రామచంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కమలేష్ డి. పాటిల్ (దాజి)తో కలిసి పరిశీలించారు.