మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం పుణేలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కర్ణాటక ప్రజల్ని లూటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ సొమ్మును మహారాష్ట్రలో ఖర్చు చేస్తోందని ఆరోపించారు. పుణె ప్రజల సాధికారత కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పరిశ్రమలపై గత పదేళ్లు కృషి చేశామన్నారు.