నల్గొండ జిల్లా దేవరకొండ నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో గురువారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు పిల్లలు అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసి టపాసులు కాల్చారు. టపాసుల కాంతులు, మోతలతో ఆయా ప్రాంతాలు ద్దద్దరిల్లుతూ కాంతులు విరజిమ్మాయి. దీపావళి అంటే చెడుపై మంచి విజయం సాధించిన రోజు అని అందుకే దీపావళి జరుపుకుంటామని పలువురు తెలిపారు.