సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను వేగవంతం చేసేలా సుపర్ వైజర్లు, ఎన్యుమరేటర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం ఆమె నల్గొండ జిల్లా నెరేడుగొమ్ము మండలం తిమ్మాపూర్ లో సమగ్ర కుటుంబ సర్వే ను తనిఖీ చేశారు. సర్వే నిర్వహణలో ఆదివారం వరకు నెరేడుగొమ్ము మండలం వెనకబడి ఉండగా సోమవారం మంచి పురోగతి తీసుకు రావడం పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.