ఉమ్మడి నల్గొండ జిల్లా జూనియర్ ఖో ఖో బాలబాలికల జట్ల ఎంపికను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొప్పోలు యందు తేదీ 20-10-2024 ఆదివారం ఎంపిక చేస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖో ఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణమూర్తి తెలియజేశారు. ఉమ్మడి జిల్లా జట్టుకి ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్ 28,29,30 తేదీలలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న 43వ జూనియర్ ఖో ఖో ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొంటారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: నాతి కృష్ణమూర్తి: 9866368843. అయితగోని విజయ్: 9949337099 నారయ్య: 9542015762.