సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద

64பார்த்தது
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం కొనసాగుతుండడంతో 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం జలాశయానికి ఇన్ ఫ్లో 3, 17, 558 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 3, 40, 932 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులనుగాను 584. 50 అడుగుల నీటిమట్టం, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకుగాను 298. 9925 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

தொடர்புடைய செய்தி