రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాలకు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలను కొనుగోలు చేస్తూ వ్యాపార సంస్థలుగా రాజకీయాలు చేసే మత తత్వ పార్టీని దేశం నుండి తరిమి కొట్టాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పెంజర్ల సైదులు కోరారు. కట్టంగూర్ మండల కేంద్రం లోని ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన సిపిఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సందర్బంగా హాజరై మాట్లాడుతూ, మతసామరస్యంతో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రంలో అక్రమ పద్ధతుల్లో మీరు కబలించి వేయాలని చూస్తున్న మీ రాక్షస పాలన మతోన్మాద విధానాలను నిలువరించేందుకు కలిసి వచ్చే పార్టీ లతో పొత్తులు పెట్టుకోవటం తప్పదు.
మీకు దమ్ముంటే రేపు మునుగోడు ఎన్నికల్లో ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా పోటీచేయండి చూద్దాం, మాలో చిత్తశుద్ధి ఉంది కనుకనే మేము పోరాడుతున్నాం మాకు వాళ్ళు ఎన్నికల్లో ఓట్లు వేయకుండా మీలాంటి వారి ప్రలోభాలకులోనైనా వాటిని పట్టించుకోకుండా వారి కోసమే పోరాడుతున్నాం భవిష్యత్తులో కూడా పోరాడుతాం తప్పకుండా సమస్యను బట్టి కేసీఆర్ పై యుద్ధం చేస్తాం కానీ మీలాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రాన్ని కబళించి వేయాలని చూస్తున్న సమయంలో తప్పకుండా చిన్న శత్రువులతో సర్దుబాట్లు తప్పవు ఒకవేళ కేసీఆర్ సమస్యను బట్టి స్పందించకపోతే తప్పనిసరిగా మా యుద్ధం యధావిధిగా కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని మతోన్మాద విధానాల్ని అమలు చేయాలని దళితులపై గిరిజనులపై మైనార్టీలపై దాడులు చేయాలని మీయొక్క కుటిల నీతిని ఇక్కడ సాగనీయం మీ పార్టీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.
అందుకే మీ దుర్మార్గ పద్ధతులను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్రంలో మీకు చోటు లేదని చెప్పేందుకే తప్పని ఈ పొత్తులు మీ స్వార్థపు రాతలతో వాస్తవాలను మరుగునపరచాలనుకోవడం కమ్యూనిజాన్ని అంతం చేయాలనుకోవడం మీ తరం కాదని ఈ సందర్బంగా హెచ్చరించారు.
ఈ సమావేశం లో మండల కమిటీ సభ్యులు మురారి మోహన్, చిలుముల రామస్వామి, కట్ట బక్కయ్య, కొండూరు సత్తయ్య ఊట్కూరు యాదయ్య, దండేంపల్లి శ్రీను, గుడుగుంట్ల రామక్రిష్ణ, గడగొజు రవీందర్, మాద సైదులు, చిన్నబోయిన శంకర్ పార్టీ గ్రామశాఖ కార్యదర్శులు గంట వెంకన్న, కృష్ణ, ముస్కు మారయ్య, దండేంపల్లి నర్సింహా, పెంజర్ల కృష్ణ, గద్దపాటి యాదయ్య, ఇస్తరి మాద నర్సింహా, నంద్యాల రాంరెడ్డి, అంజయ్య ఉట్కూరు సైదులు, వంగూరి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.