నా చేతుల మీదుగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ జరగడం నా అదృష్టమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ తెలంగాణ కోసం పదవి త్యాగం చేసి, పార్టీలకు అతీతంగా పోరాటం చేసిన వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన ఆలోచనలు, ఆశయాలు మనం కాపాడుకోవాలన్నారు. ఏదో ఒక జిల్లాకు లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని తన అభిప్రాయమన్నారు.