సమగ్ర కుటుంబ సర్వే ను తప్పులు లేకుండా జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఎట్టి పరిస్థితులలో సర్వే వివరాలు తప్పుగా నమోదు చేయవద్దని, పూర్తి జాగ్రత్తగా ఆలోచించి వివరాలు నింపాలని అన్నారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా, మునుగోడు మండలం, గూడాపూరు గ్రామంలో నిర్వహిస్తున్న సామాజిక , ఆర్థిక , విద్య , ఉపాధి, రాజకీయ మరియు కుల, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను తనిఖీ చేశారు.