మిర్యాలగూడ: రక్తదానం చేసిన యువకుడు

63பார்த்தது
మిర్యాలగూడ: రక్తదానం చేసిన యువకుడు
మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు ఏ పాజిటివ్ రక్తం అత్యవసరం అయ్యింది. పేషంట్ కుటుంబ సభ్యులు మేధ ఫౌండేషన్ వారిని సంప్రదించగా, వారు పలు గ్రూప్ ల్లో పోస్ట్ చేయగా, సమాచారం తెలుసుకున్న ముకుందాపురం గ్రామ యువకుడు రాం వంశి, పేషంట్ ఉన్న నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బుధవారం స్వచ్ఛంద రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, 53వ సారి రక్తదానం చేయడం సంతోషంగా ఉందని అన్నారు.

தொடர்புடைய செய்தி