హుజూర్నగర్ పట్టణానికి చెందిన వైద్యుడు డాక్టర్ సుదర్శన్ నాయుడు సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. హుజూర్నగర్ పట్టణంలో ఆయన గత 20 సంవత్సరాలుగా ప్రాక్టీస్ నిర్వహిస్తూ ప్రజల అభిమానాలు పొందారు. ఆయన మృతి పట్ల హుజూర్నగర్ డివిజన్ ఆర్ఎంపీల సంఘం అధ్యక్షులు మన్సూర్ అలీ జిల్లా గౌరవ అధ్యక్షులు బాబు, మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు కోశాధికారి శ్రీనివాస్ కోటేశ్వరరావు, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.