దేవరకొండ: కస్తూర్బా పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే
ప్రభుత్వం గురుకులాలకు పెద్ద పీట వేస్తుందని, ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణ శివారులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఎమ్మెల్యే అకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినులతో, అధ్యాపకులతో మాట్లాడారు. అనంతరం భోజనాన్ని పరిశీలించి విద్యార్థినిలతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహా, తదితరులు పాల్గొన్నారు.