విద్యార్థులు చదువు పైనే దృష్టి సారించి మంచి లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శనివారం ఆమె నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని పలు రెసిడెన్షియల్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వంటగదిని, స్టోర్ రూమ్ ను పరిశీలించారు. స్టోర్ రూమ్ లోకి ఎలుకలు, బల్లుల వంటివి రాకుండా శుభ్రంగా ఉంచాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు.