నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ లో బోటింగ్ పై నిషేధం విధించారు పోలీసులు. బ్యాక్ వాటర్ లో పర్యాటకులు స్నానాలకు దిగి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందుతుండడంతో విహారయాత్రలు విషాదయాత్రలుగా మారుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో ముగ్గురు పర్యాటకులు నీటిలో మునిగి చనిపోవడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.