దేవరకొండ: సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎబి బర్ధన్ 9వ వర్ధంతిని గురువారం సీపీఐ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ బర్ధన్ మతోన్మాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి, తన చివరి శ్వాస వరకు ప్రజా సమస్యలపై ఉద్యమించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.