ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

478பார்த்தது
ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల యాజమానంపై చర్యలు తీసుకోవాలని బీసీ యువజన సంఘం దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు చింతపల్లి సతీష్ గౌడ్ అధికారులను కోరారు. స్థానిక బీసీ సంఘం. కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సంఘం ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీస మౌలిక సౌకర్యాలు కల్పించకుండా ప్రైవేటు పాఠశాలల యాజమా న్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఫీజుల నియం త్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం, నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ సురకారం సత్యం దేవరకొండ మండల యువజన సంఘం నాయకుడు పాలకుర్ల శివ, చందంపేట మండల ప్రధాన కార్యదర్శి మట్టపల్లి అనిల్, తాటి కోల్ గ్రామ యూత్ అధ్యక్షులు హనుమంతు మధు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி