యాదాద్రి ఆలయంలో నెయ్యి స్వచ్ఛమైనదే: ఈవో భాస్కరరావు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లడ్డూ తయారీకి వాడే నెయ్యి స్వచ్ఛమైనదేనని ఈవో భాస్కరరావు తెలిపారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలతో ప్రభుత్వ ఆదేశాల మేరకు నెయ్యిని పరీక్షలకు పంపామన్నారు. కిలో రూ.609కి కొనుగోలు చేస్తున్న నెయ్యి నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉన్నట్లు తెలిపారు. రోజుకు వెయ్యి కిలోల నెయ్యిని మదర్ డెయిరీ నుంచి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.