అమ్మ ఆదర్శ పాఠశాలల యమ్ బి రికార్డు నమోదు పనులు, భూముల లే అవుట్ క్రమబద్దీకరణ, పై మండల అభివృద్ధి అధికారులతో జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జండగే సమీక్ష నిర్వహించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ తో కలసి సమీక్షించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల క్రింద పూర్తి అయిన పనులకు సంబంధించిన యమ్ బి రికార్డులు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.