యాదగిరిగుట్ట: సమగ్ర కుటుంబ సర్వేని ప్రారంభించిన ఎమ్మెల్యే
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని బీసీ కాలనీలో సమగ్ర కుటుంబ సర్వేని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య బుధవారం ప్రారంభించారు. ఈ కులగనణకు ప్రజలందరూ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి అడిషనల్ కలెక్టర్ గంగాధర్, యాదాద్రి మున్సిపల్ చైర్ పర్సన్, ఎరుకల సుధా హేమేందర్ , మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.