యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని అన్ని ఐకెపి సెంటర్లకు, వ్యవసాయ మార్కెట్ యార్డుకు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించి, ధాన్యాన్ని తెచ్చిన రైతులను వారు పడుతున్న ఇబ్బందులను వారిని అడిగి తెలుసుకున్నారు.