యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా దట్టమైన పొగ మంచు అలుముకున్నది. గురువారం చలితో పాటు దట్టమైన పొగ మంచు కురవడంతో రహదారులపై ప్రయాణించే వాహనదారులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదయం 10 దాటినా కూడా పొగ మంచు పోవడం లేదు. చలి నుండి రక్షించుకునేందుకు ప్రజలు చలి మంటలు వేసుకుంటున్నారు. రాగల రోజులలో చలి తీవ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.