సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 8న యాదాద్రి పంచ నరసింహుల పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. సీఎం తన పుట్టిన రోజు సందర్భంగా వచ్చే శుక్రవారం రానున్న సమాచారంతో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య హేలిప్యాడ్ ప్రాంగణానికి సంబంధిత అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. దేవస్థానం ఈవో భాస్కరరావు సూచనలతో సివిల్ విభాగం కనుమదారికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ కు రంగులు వేసే పనులు చేపట్టింది.