హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో ముఖ్యమంత్రి స్వగృహంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 8వ తేదీన యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో పలు విషయాలను చర్చించారు. ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులు, పలు సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించారు.