యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని వెల్మజాల, గుండాల, వస్తాకొండూర్ గ్రామాలలోని పి. ఎ. సి. ఎస్, ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ప్రభుత్వం సన్నధాన్యానికి బోనస్ గా రూ.500 మద్దతు ధర అందిస్తుందన్నారు.