ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన LSG జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. LSG బ్యాటర్లలో మాక్రమ్ (53), మిచెల్ మార్ష్(60) అర్థశతకాలతో రాణించారు. MI బౌలర్లలో హార్దిక్ 5 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీకుమార్, విఘ్నేశ్ పుత్తూర్ తలో వికెట్ తీశారు.