సంగారెడ్డి: కలెక్టర్ కార్యాలయం ముందు పంచాయతీ కార్మికుల ధర్నా
పెండింగ్ వేతనాలు చెల్లించండి కోరుతూ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా నాయకులు బాబురావు మాట్లాడుతూ మూడు నెలల నుంచి పంచాయతీ కార్మికులకు వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు వెంటనే ప్రభుత్వం వేతనాలు విడుదల చేయాలని కోరారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.