బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఒడిశా బీహార్ రాష్ట్రాలకు చెందిన మహిళలు గురువారం భక్తిశ్రద్ధలతో మున్సిపల్ వీధుల్లో కలశ యాత్రను నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది మా అంబి మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు కలశ యాత్రను నిర్వహించడంపై కౌన్సిలర్ చంద్రారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.