సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శుక్రవారం మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయి వెన్నుపూస గాయంతో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగుడికి అండగా నిలిచారు. సొంత నిధులతో ఆటో అందించి తన ఉదారతను చాటుకున్నారు. గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.