నర్సాపూర్ పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు స్థలాన్ని పురపాలక సంఘం చైర్మన్ అశోక్ గౌడ్ శుక్రవారం పరిశీలించారు. ఓపెన్ జిమ్ రెండు మూడు రోజులలో పూర్తి హంగులతో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండుటకు గాను ఓపెన్ జిమ్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓపెన్ జిమ్ ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్నందున దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంటుందని పేర్కొన్నారు.