మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో బుధవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మనోహరాబాద్ మండలానికి చెందిన 41 మంది, తూప్రాన్ మండలానికి చెందిన 69 మంది లబ్ధిదారులకు అధికారులు, ప్రజాప్రతినిధులు చెక్కులు పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం నిరుపేద ఆడపిల్లలకు వరం లాంటిదని వారన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.