మెదక్ జిల్లా తూప్రాన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తూంకుంట నర్సారెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే అభివృద్ధి వేగవంతంగా కొనసాగుతోందని, ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.